'ఎస్సీగా ఎందుకు పుట్టాలనుకోలేదో బాబు చెప్పాలి' | uppuleti kalpana fire on chandra babu in sc caste issue | Sakshi
Sakshi News home page

'ఎస్సీగా ఎందుకు పుట్టాలనుకోలేదో బాబు చెప్పాలి'

Published Tue, Feb 9 2016 1:39 PM | Last Updated on Sat, Jul 28 2018 6:51 PM

'ఎస్సీగా ఎందుకు పుట్టాలనుకోలేదో బాబు చెప్పాలి' - Sakshi

'ఎస్సీగా ఎందుకు పుట్టాలనుకోలేదో బాబు చెప్పాలి'

హైదరాబాద్: ఎస్సీగా ఎందుకు పుట్టాలనుకోలేదో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దళితులను కించపరిచే మాటలు మాట్లాడతారా అని ప్రశ్నించారు. 'కుల రాజకీయాలు చేస్తున్నారని ఈ మధ్యకాలంలో చాలాసార్లు చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు అయితే కుల రాజకీయాలు చేసింది, కులాల గురించి ప్రస్తావించింది మీరు కాదా' అంటూ ఆమె మండిపడ్డారు. గతంలో దళితులు, బీసీల మధ్య తగాదాలు పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. కులాల గురించి ఇలా మాట్లాడటం ఆయన కుసంస్కారానికి నిదర్శమని పేర్కొన్నారు. ఎస్సీలను అవమానించేలా సీఎం మాట్లాడటం హేయం అన్నారు.

'పేద, ధనిక అని రెండు కులాలున్నాయని బాబు భ్రమపడుతున్నారు. కానీ, నిజానికి రెండే కులాలున్నాయి.. ఒకటి మంచి.. రెండు చెడు అని చెప్పారు. ఎస్సీల ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడాన్ని అవమానంగా భావిస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశారు. గెలుపే లక్ష్యంగా హామీలే మార్గంగా ఎన్నికల వేళ వ్యవహరించిన బాబు వాటిని తీర్చలేక పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారని కల్పన ఆరోపించారు. బీసీ నాయకుడికి చోటిస్తే జిల్లాలో టీడీపీ ఓడిపోయిందట... దళితుడికి సీటిస్తే బలం తగ్గిపోయిందట.. బాబుకు కింద నుంచి పైదాకా కుల వివక్ష ఉంది. అసలు ఆయన ఏం అనుకుంటున్నారో ప్రజలకు ఏమాత్రం అర్థం కావడం లేద' అని కల్పన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement