
'కులగజ్జిలో నాగార్జున వర్సిటీ'
హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయం కులగజ్జితో కుళ్లిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఎస్సీ కులానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. బాబురావుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. బుధవారం ఆమె అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో సమయంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక నారాయణ కాలేజీలో దాదాపు పదిహేనుమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.
ఇవి చదువులకు నిలయాలా చావులకు కర్మాగారాల అని ఆమె నిలదీశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పుతో మరో టీచర్ను కొడతారా అని నిలదీశారు. సహచర టీచర్ మీద కనీస గౌరవం లేకుండా చెప్పుతో కొట్టారంటే ఆమె సంస్కారమేమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రిషితేశ్వరిది ఆత్మహత్యకాదని ఇది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు.