పామర్రు: కృష్ణా జిల్లాలోని పామర్రులో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. వ్యవసాయ కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా టీడీపీ, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.