
ప్రతీకాత్మక చిత్రం
పామర్రు: సోషల్ మీడియా ఆర్గనైజర్ నాగబాబుపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. అమరావతిలో జరుగుతున్న అక్రమాలు, అధికార పార్టీ నేతల అవినీతిపై సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం వారికి కోపం తెప్పించాయి. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పోలీసులపై ఒత్తిడి తేవడంతో నాగబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. నాగబాబును అదుపులోకి తీసుకోవడంతో సోషల్ మీడియా ఆర్గనైజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తప్పుడు కేసులు నమోదు చేయడంపై వైఎస్సార్‌సీపీ విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, కె. పార్ధసారథి, పామర్రు ఇన్‌చార్జి కైలా అనీల్ కుమార్‌లు మండిపడ్డారు. పామర్రు పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్‌సీపీ తెలిపారు. అక్రమాలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు సోషల్ మీడియా గొంతు నొక్కేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment