విశాఖలో టీడీపీ నేత ‘గుడివాడ’ దందాలు వెలుగులోకి
సాక్షి, విశాఖపట్నం, విజయవాడ: ధనార్జనే ధ్యేయంగా అధిక వడ్డీలకు డబ్బులు తిప్పుతూ బెదిరింపులు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు ‘కాల్‌మనీ’ వ్యాపారులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఒకరు టీడీపీ నేత కాగా మరొకరు వ్యాపారి.పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడితో సన్నిహితంగా ఉంటూ, టీడీపీ నాయకుడిగా చలామణి అవుతూ కాల్‌మనీ కేసులు ఎదుర్కొంటున్న గుడివాడ రామకృష్ణను విశాఖ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితుడి నుంచి 37 చెక్‌లు, 39 ప్రామిసరీ నోట్లు, నాలుగు కత్తులు, ఎల్‌ఐసీ బాండ్లు, కారు, ద్విచక్రవాహనంను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ త్రివిక్రమవర్మ వెల్లడించారు. నిందితుడిపై వరుసగా కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు తిరుపతి వెళ్లి వస్తూ ప్రత్యేక పోలీసు బృందానికి చిక్కాడు. రామకృష్ణ తన కారుకు టీడీపీ జెండాను అమర్చుకుని తిరుగుతున్నాడు.
మంత్రి అయ్యన్నతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు అతడి నివాసంలో దొరికాయి. పోలీసులు మాత్రం రికార్డుల్లో రామకృష్ణ ఏ పార్టీకీ చెందని వాడిగా పేర్కొంటున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనానికి ఉన్న టీడీపీ జెండాను కూడా తొలగించారు.
బెజవాడలో ఉద్యోగులకు బెదిరింపులు
ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడుతున్న ఆరోపణలపై కాల్‌మనీ వ్యాపారి రాంపిళ్ల పాపారావును విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ కమిషనరేట్‌లో కాల్‌మనీ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాక తొలి అరెస్టు ఇదే. డీసీపీ ఎల్.కాళిదాస్ విలేకరులకు ఈ కేసు వివరాలు వెల్లడించారు.
ఇద్దరు ‘కాల్’ నాగుల అరెస్టు
Published Fri, Dec 25 2015 3:39 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement