అల్లిపురం: కాల్‌మనీ కేసులో తప్పించుకు తిరుగుతు న్న బడా ఫైనాన్షియర్ గుడివాడ రామకృష్ణను ఆరి లోవ, ఎంవీపీ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రి మాండ్‌కు తరలించారు. అతని వద్ద నుండి 37 బ్లాంక్ చెక్కులు, 39 ప్రామిసరీ నోట్లు, 4 కత్తులు, ఎల్‌ఐసీ బాండ్లు, కారు, స్కూటర్, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర శాంతిభద్రతల డీసీపీ టి.త్రివిక్రమవర్మ వివరాలు వెల్లడించారు. లాసన్స్‌బే కాలనీకి చెందిన గుడివాడ రామకృష్ణ రియల్ ఎస్టేట్, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారాలు చేస్తుంటాడు. ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు, విలువైన డాక్యుమెంట్లు తీసుకుని నూటికి రూ.6 వడ్డీ చొప్పున అప్పులు ఇస్తుంటాడు.
అప్పు తీర్చేసినా డాక్యుమెంట్లు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు తిరిగి ఇవ్వకుండా అప్పు తీసుకున్న వారిని ఇబ్బంది పెట్టటమే కాకుండా మహిళలను లైంగిక వే ధింపులకు గురి చేయటం, చంపేస్తానని, వారి కు టుంబసభ్యులను కిడ్నాప్ చేస్తానని బె దిరించటం చేస్తుంటాడు. ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో ఆదర్శనగర్‌కు చెందిన దీప్తి శారద అనే మహిళ, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కుమారి అనే మహిళ రామకృష్ణపై ఫిర్యాదు చేశారు. తాను తీసుకున్న రూ.5 లక్ష ల అప్పుకుగాను రూ.35 లక్షల ఇంటిని స్వాధీనం చేసుకున్నారని పెదవాల్తేరుకు చెందిన బి.వి.ఆర్.కె.సి.కిషోర్ ఎంవీపీ కాలనీ స్టేషన్‌లో ఈ నెల 18న ఫిర్యాదు చేశారు. మధురవాడ ఏసీపీ దాసరి రవి బాబు పర్యవేక్షణలో ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు, ఎంవీపీ సీఐ విద్యాసాగర్, ఎస్‌ఐ కాంతారా వు, ఇతర సిబ్బందితో నిందితుడిని 2 రోజుల క్రితం తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. గురువారం నగరానికి తీసుకువచ్చి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు గుడివాడ రామకృష్ణపై 1993 లో టూటౌన్‌లో మోటారు సైకిల్ దొంగతనం కేసు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు రివార్డులను అందజేశారు.
రామకృష్ణ వేధింపులు భరించలేనివి
డబ్బులు ఇవ్వకపోతే తనతో ఒక రోజు గడపమనేవాడని, అలా అయితే అప్పును వదులుకుంటానని వేధించేవాడని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అలా కానిపక్షంలో పిల్లలను కిడ్నాప్ చేస్తానని బెదిరించేవాడని వాపోయారు. తాము పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తరువాత కూడా కాసానిబాబా అనే వ్యక్తితో బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. భార్యాభర్తలను విడదీస్తామని, కాపురాలు కూల్చుతామని నిత్యం టార్చర్ పెడుతుండేవాడని తెలి పారు. ఏసీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ ‘అలాంటివి కామనే’ అని కొట్టి పారేశారన్నారు. తమలా చాలా మంది బాధితులు ఉన్నారని వారు తెలిపారు.
బాధితులు 1090కి ఫిర్యాదు చేయవచ్చు
గుడివాడ రామకృష్ణ బాధితులు ఎవరైనా ఉంటే 1090 నంబరుకు ఫోన్ చేసిగాని, నేరుగా గాని ఫిర్యాదు చేయవచ్చని డీసీపీ టి.త్రివిక్రమవర్మ తెలిపారు. బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకునేందుకు 24 గంటలు ఈ నంబరు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
కాల్‌మనీ కేటుగాడు అరెస్ట్
Published Thu, Dec 24 2015 11:25 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement