'టీడీపీ ఎమ్మెల్యేలు ఆ అంశంపై ఎందుకు మాట్లాడరు?' | ysrcp mlas take on chandra babu | Sakshi
Sakshi News home page

'టీడీపీ ఎమ్మెల్యేలు ఆ అంశంపై ఎందుకు మాట్లాడరు?'

Published Tue, Dec 22 2015 3:55 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

'టీడీపీ ఎమ్మెల్యేలు ఆ అంశంపై ఎందుకు మాట్లాడరు?' - Sakshi

'టీడీపీ ఎమ్మెల్యేలు ఆ అంశంపై ఎందుకు మాట్లాడరు?'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, కళావతి, పుష్పశ్రీవాణి, రాజేశ్వరి ఆరోపించారు. మంగళవారం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు తమ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు.

అసెంబ్లీలో ఈ రోజు కన్నీరు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు కాల్ మనీ సెక్స్ రాకెట్పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.  కాల్మనీ సెక్స్ రాకెట్ను పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. కాల్ మనీ వ్యవహారంపై చర్చకు నిరాకరించడం, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ను ఎత్తివేయనందుకు నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బాయ్కాట్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement