విజయవాడ: ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాల్ మనీ-సెక్స్ రాకెట్' కేసులో నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అదుపులోనికి తీసుకున్న నిందితులను మరికాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్ మనీ కేసులో ఏ4 నిందితుడు ఎలక్ట్రిసిటీ డీఈ సత్యానందంపై సస్పెన్షన్ వేటు పడింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సీఎండీ హెచ్.జె.దొర జారీ చేశారు.