ఏపీకి దగా: మధు | CPM Leader Madhu Comments on Union Budget | Sakshi
Sakshi News home page

ఏపీకి దగా: మధు

Published Fri, Feb 2 2018 2:17 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

CPM Leader Madhu Comments on Union Budget - Sakshi

సీపీఎం నాయకుడు మధు

సాక్షి, గుంటూరు: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగిందేమీ లేదని, బడ్జెట్‌ను కేవలం రాజకీయ ప్రచారం కోసం వాడుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎన్నికలున్న రాష్ట్రాలకు భారీ మొత్తంలో నిధులు కేటాయించారని ఆరోపించారు. కేంద్రం ఏపీని దగా చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేహోదా కంటే ప్యాకేజీనే మంచిదంటూ ఇంతకాలం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు.

రేపు విజయవాడలో వామపక్షాల సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్‌ప్లాంట్ కోసం తాము చేస్తున్న పోరాటానికి కలిసి వచ్చేవారితో చేతులు కలపడానికి సిద్ధమని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీతోనైనా కలిసి పోరాటం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని మధు అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement