'టీడీపీ నేతల రౌడీయిజం పెరిగిపోతోంది' | cpm secretary madhu slams tdp | Sakshi
Sakshi News home page

'టీడీపీ నేతల రౌడీయిజం పెరిగిపోతోంది'

Published Mon, Aug 3 2015 1:36 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

'టీడీపీ నేతల రౌడీయిజం పెరిగిపోతోంది' - Sakshi

'టీడీపీ నేతల రౌడీయిజం పెరిగిపోతోంది'

అనంతపురం: అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల రౌడీయిజం రోజురోజుకు పెరిగిపోతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు.  ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు.

సోమవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జిల్లాలో భయంకరమైన కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ హంద్రీనీవాకు నీరు ఎందుకు ఇవ్వరంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాజధాని భూముల విషయంలోనూ టీడీపీ రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని, పంటలను తగలబెట్టి రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కున్నారని ఆరోపించారు. రాజధాని పొలాల దహనంపై న్యాయవిచారణ ఊసే లేకుండాపోయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement