టీడీపీ కాంగ్రెస్గా మారింది: మధు | CPIM leader Madhu takes on TDP | Sakshi
Sakshi News home page

టీడీపీ కాంగ్రెస్గా మారింది: మధు

Published Sun, Apr 13 2014 4:24 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

టీడీపీ కాంగ్రెస్గా మారింది: మధు - Sakshi

టీడీపీ కాంగ్రెస్గా మారింది: మధు

విశాఖపట్నం: బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం అవకాశవాదమని ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యదర్శి  మధు విమర్శించారు. మతతత్వ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం దేశానికే ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

వలసలను ప్రోత్సహిస్తున్న టీడీపీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీగా మారిందని మధు విమర్శించారు. కాంగ్రెస్ నేతలను చేర్చుకుని ఎన్నికల్లో గెలవాలనుకోవడాన్ని తప్పుపట్టారు. విశాఖపట్నం జిల్లాలో రెండు లోక్సభ, 8 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామని మధు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement