
సాక్షి, హైదరాబాద్: బహు జన సమాజ్ పార్టీ అభ్య ర్థులు రాష్ట్రంలోని 119 ని యోజకవర్గాల్లో నామినేష న్లు దాఖలు చేశారు. శుక్రవారం పార్టీ 21 అసెంబ్లీ స్థానాలతో తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలో బీఎస్పీ తొలిసారి మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. కాగా, నాటకీయ పరిణామాల మధ్య పటాన్‌చెరు స్థానం నుంచి నీలం మధు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ఆయన పేరును మొదట ప్రకటించినప్పటికీ, తర్వాత ఆయన అభ్యర్థిత్వాన్ని చివరి నిమిషంలో మార్చడంతో మధు బీఎస్పీలో చేరారు.
అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం: ప్రవీణ్‌కుమార్: తెలంగాణలో అవినీతి, కు టుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్ర జలు సిద్ధంగా ఉన్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షు డు ప్రవీణకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. బహుజనుల రాజ్యాధికార కల సాకారం అ య్యే రోజు దగ్గర్లోనే ఉందని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను జనం నమ్మడం లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment