న్యాయం జరగకపోతే ఉద్యమమే
రెవెన్యూ అధికారుల అవినీతి
నిర్వాసితులకు అన్యాయం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందని, చట్ట ప్రకారం అమలు కావలసిన ప్యాకేజీ అమలు కావటం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ముంపు గ్రామాలైన కొరుటూరు, శివగిరి, తల్లవరం, గాజులగొంది, పైడిపాక, వాడపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన పార్టీ నాయకులతో కలసి పర్యటించారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. పోలవరంలోని అంబేడ్కర్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలోనూ, అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. రెవెన్యూ అధికారులు అవినీతిలో కూరుకుపోయారని, జాబితాలో పేర్లు రాలేదని అడిగితే తిడుతున్నారని మధు విమర్శించారు. 2013 చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. మొదటి విడత గ్రామాలు ఖాళీచేయించారని
యించారని, చేగొండపల్లి నిర్వాసితులకు మంచి భూములు ఇవ్వలేదని, ఇళ్లు కారిపోతున్నాయని అన్నారు. గిరిజనేతరులకు చెందిన 50 వేల ఎకరాల భూములు ఉండగా, వాటి జోలికి వెళ్లకుండా, వివాదాస్పద భూములు నిర్వాసితులకు ఇస్తున్నారన్నారు. సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తామని, న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని అన్నారు.రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారాం మాట్లాడుతూ ఈనెల 19విజయవాడలో రాష్ట్ర ప్రాజెక్టుల నిర్వాసితుల సదస్సు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ మొదటి వారంలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై సమావేశం
రాజమహేంద్రవరంలో నిర్వమిస్తామన్నారు. సీపీఎం డివిజన్ నాయకుడు ఎ.రవి, బొరగం భూచంద్రరావు, గుడెల్లి వెంకట్రావు పాల్గొన్నారు.