'రాజధానిని సింగపూర్.. పోలవరాన్ని జర్మనీకి అప్పగిస్తారా?' | CPM leader madhu criticises chandra babu on capital and polavaram issue | Sakshi
Sakshi News home page

'రాజధానిని సింగపూర్ కు.. పోలవరాన్ని జర్మనీకి అప్పగిస్తారా?'

Published Thu, Oct 8 2015 10:41 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'రాజధానిని సింగపూర్.. పోలవరాన్ని జర్మనీకి అప్పగిస్తారా?' - Sakshi

'రాజధానిని సింగపూర్.. పోలవరాన్ని జర్మనీకి అప్పగిస్తారా?'

అనంతపురం : నూతన రాజధాని నిర్మాణం పనులు సింగపూర్కు, పోలవరం ప్రాజెక్టును జర్మనీకి అప్పగిస్తారా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతపురం పట్టణంలో గురువారం నాడు మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షకు మధు సంఘీభావం తెలిపారు.

తనపై ఉన్న కేసులు భయటపెడతారనే భయంతోనే సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదంటూ విమర్శించారు. ఏపీని చంద్రబాబు విదేశాలకు తాకట్టు పెడుతున్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement