కడప: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అదే తరహాలో రాష్ట్ర అభివృద్ధిని కూడా పట్టించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. గురువారం ఆయన కడపలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పలోభాలకు గురిచేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం తగదని హితవు పలికారు.ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను సవరించాలని, ఆ దిశగా ప్రస్తుతం జరుగుతున్న చర్చను తమ పార్టీ ఆహ్వానిస్తోందని చెప్పారు. ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గుర్తింపుపై స్పీకర్ అధికారాలను తగ్గించాలని సూచించారు. అక్రమ ఫిరాయింపులపై తాము త్వరలో ఉద్యమం చేపడతామని చెప్పారు.