వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సిగ్గుమాలిన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.
తిరుపతి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సిగ్గుమాలిన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. 'రోజా ప్రస్తావించిన అంశాలన్నీ సమంజసమే. కాల్మనీ సెక్స్ రాకెట్లో అధికార పార్టీ నేతలే ఉన్నారు. వారి పై చర్యలు తీసుకోకుండా ఇతరులను విమర్శిస్తున్నారు' అని ఆయన పేర్కొన్నారు.