
సాక్షి, తాడేపల్లి: గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. గురువారం మధు నివాసానికి వెళ్లిన సీఎం ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మధును పరామర్శించారు. ఈ సందర్భంగా మధుతో వారిద్దరు కాసేపు ముచ్చటించారు.
Comments
Please login to add a commentAdd a comment