ఉప ఎన్నికల్లో టీడీపీని ఓడించండి
సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ
అనంతపురం న్యూసిటీ: నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను టీడీపీ మోసగిస్తోందన్నారు. హద్దూపద్దు లేని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజలను అన్ని రంగాల్లో అసంతృప్తి పరిచిందని ధ్వజమెత్తారు.
ప్రత్యేక హోదా సమస్యకు ద్రోహం చేయడమే కాక, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ప్రకటించిన వాగ్దా నాలను అమలు చేయలేదన్నారు. అవినీతి, లంచగొండితనం, పార్టీ ఫిరాయింపులు పెరిగిపోయాయన్నారు. అధికార టీడీపీ, బీజేపీ కూటమిని నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడించి ప్రభుత్వ పాలనపట్ల నిరసన తెలియజేయాలన్నారు.