కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆచరణాత్మక ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తామని ప్రకటించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాయి.
హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆచరణాత్మక ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తామని ప్రకటించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాయి. ఎన్నో సమస్యలపై ఏకాభిప్రాయంతో ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టిన సీపీఐ, సీపీఎంల మధ్య ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన సర్దుబాటు మాత్రం ఇప్పటివరకు ఓ కొలిక్కి రాలేదు.
సీమాంధ్రలో నామినేషన్ల గడువు మరో రెండ్రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 20న మరోవిడత చర్చలు జరపాలని నిర్ణయించాయి. అరుుతే అప్పటికే నామినేషన్ల పర్వం ముగుస్తున్నందున ఉపసంహరణల తేదీ నాటికి సీట్ల సర్దుబాట్లపై అవగాహనకు ప్రయత్నిస్తామని, లేకుంటే వివాదాస్పద సీట్లలో ఇరు పార్టీలు స్నేహపూర్వక పోటీలకు దిగుతాయని ఆయా పార్టీల ఆంధ్రప్రదేశ్ నేతలు మధు, రామకృష్ణ తెలిపారు.