
పటాన్‌చెరు టౌన్ (హైదరాబాద్): బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సానుకూల నిర్ణయం కోసం ఈనెల 16 వరకు ఎదురుచూస్తానని, అప్పటికీ తేల్చకుంటే ఆ పార్టీకి రాజీనామా చేస్తానని ఎన్‌ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు నీలం మధుముదిరాజ్ ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
బీఆర్‌ఎస్ బలోపేతం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టానని, అధిష్టానం పటాన్‌చెరు నుంచి టికెట్ ఇస్తుందని ఆశించానని తెలిపారు. ఏ పార్టీ టికెట్ ఇస్తే, ఆ పార్టీ నుంచి కండువా కప్పుకుని పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రజా సమస్యల ఎజెండాగా నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం కొత్తపల్లి ఒకటో నంబర్ బూత్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు.