టీడీపీ ప్రజల నుంచి దూరమవుతోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలు మరింత ప్రస్ఫుటం అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ హామీలు నెరవేరలేదనే సీఎం సభలో ముస్లిం యువకులు ప్రశ్నించారని పేర్కొన్నారు. ప్లకార్డులు చూపినందుకు నాన్‌బెయిల్‌బుల్ కేసులు పెట్టారు.. సీఎం సభలో జరిగిన దానిని వైఎస్సార్‌సీపీ కుట్ర అని చెప్పడం దారుణమని మండిపడ్డారు.