సీపీఎం నేత మధు అరెస్ట్, ఉద్రిక్తత
కృష్ణా: ఇలపర్రులో తమ భూములను అగ్రవర్ణాలు లాక్కున్నాయంటూ దళితులు చేస్తున్న ఆందోళనకు సీపీఎం అండగా నిలిచింది. దళితుల భూ ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని, భూములను స్వాధీనం చేసుకుంటామని పార్టీ నేత రాఘవులు చేసిన అల్టిమేటం గడువు సోమవారంతో ముగుస్తుండటంతో.. సీపీఎం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేశారు. గుడివాడలో సీపీఎం నేత మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తమ భూములు కాపాడుకోవడానికి ఎంతమంది నేతలను కలిసినా ప్రయోజనం లేదని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు దక్కేవరకు ఆందోళన ఆగదని వారు స్పష్టం చేస్తున్నారు.