ఓయోలో 1,000 మందికి ఉద్వాసన..! | Oyo to lay off 1,000 people as part of restructuring exercise | Sakshi
Sakshi News home page

ఓయోలో 1,000 మందికి ఉద్వాసన..!

Published Tue, Jan 14 2020 5:40 AM | Last Updated on Tue, Jan 14 2020 5:40 AM

Oyo to lay off 1,000 people as part of restructuring exercise - Sakshi

న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సంస్థ ‘ఓయో’ 1,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కంపెనీని వీడి ఇతర సంస్థల్లో ఉద్యోగాలను చూసుకోవాలంటూ పలువురికి ఈ–మెయిల్స్‌ అందినట్లు వెల్లడైంది.  అయితే, దీనిపై ఇప్పటివరకు కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు.‘రైట్‌–సైజింగ్‌’ పేరిట ఈ ఉత్తరాలు అందినట్లు సమాచారం. ప్రస్తుత ఏడాది కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై సంస్థ సీఈఓ రితేష్‌ అగర్వాల్‌ స్పందిస్తూ.. ఉద్యోగులను బయటకు వెళ్లి మరో సంస్థలో చేరమని కోరడం అంత సులువైన విషయం కాదని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement