క్రీడాకారులకు ప్రోత్సాహమివ్వాలి | give encouragement to sports men | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు ప్రోత్సాహమివ్వాలి

Aug 10 2016 11:40 PM | Updated on Sep 4 2017 8:43 AM

క్రీడాకారులకు ప్రోత్సాహమివ్వాలి

క్రీడాకారులకు ప్రోత్సాహమివ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం ్రMీ డాకారులకు ప్రోత్సాహమిచ్చి క్రీడారంగ అభివృద్ధికి కృషి చేయాలని వాలీబాల్‌ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చందా నాగిరెడ్డి కోరారు.

కోదాడఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం ్రMీ డాకారులకు ప్రోత్సాహమిచ్చి క్రీడారంగ అభివృద్ధికి కృషి చేయాలని వాలీబాల్‌ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చందా నాగిరెడ్డి కోరారు. బుధవారం కోదాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అతిథిగృహంలో జరిగిన సమావేశంలో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ  ప్రాంత క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియాలు నిర్మించాలన్నారు. క్రీడాకారులైన విద్యార్థులకు ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో 2.5శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. క్రీడాకారుల సంక్షేమం కోసం ఈ నెల 21న పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడాకారుల సంక్షేమ నియోజకవర్గ  కమిటీని ఎన్నుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో క్రీడాకారులు  కళ్యాణ్, శ్రీనివాసరావు, ఎస్‌కె.బాగ్దాద్,  తిరుపతయ్య, ఆలేటి సహదేవ్, శ్రావణ్‌కుమార్, పాలడుగు సంజీవ్, జూలూరు వీరభద్రం, చిన్నా,  గోపిచంద్, రామదాసు, విజయ్‌కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement