బెంగళూరు: రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి మరో ముగ్గురు అథ్లెట్స్ అర్హత సాధించారు. సోమవారం జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి మీట్‌లో రంజిత్ మహేశ్వరీ (ట్రిపుల్ జంప్), ధరమ్‌బీర్ సింగ్ (200 మీటర్లు), జిన్సన్ జాన్సన్ (800 మీటర్లు) రియో అర్హత ప్రమాణాలను అందుకున్నారు. హరియాణాకు చెందిన 27 ఏళ్ల ధరమ్‌బీర్ 200 మీటర్ల రేసును 20.45 సెకన్లలో ముగించి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా 36 ఏళ్ల తర్వాత 200 మీటర్ల విభాగంలో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్న భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు.
రంజిత్ మహేశ్వరీ 17.30 మీటర్ల దూరం దూకి... 16.85 మీటర్లతో ఉన్న రియో ఒలింపిక్స్ అర్హత ప్రమాణాన్ని అధిగమించాడు. జిన్సన్ జాన్సన్ 800 మీటర్ల రేసును ఒక నిమిషం 45.98 సెకన్లలో పూర్తి చేసి రియో అర్హత ప్రమాణాన్ని (ఒక నిమిషం 46.00 సెకన్లు) అందుకొని ఒలింపిక్ బెర్త్ దక్కించుకున్నాడు.
‘రియో’కు మరో ముగ్గురు అర్హత
Published Tue, Jul 12 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM
Advertisement
Advertisement