
పతకాలు తేలేదుగా... గనుల్లో పనికెళ్లండి!
ప్యాంగ్‌యాంగ్: ఉత్తర కొరి యా నియంత కిమ్ జాంగ్ వున్ గురించి ప్రపంచానికి తెలిసిందే. తాజాగా ఆయన బాధితుల జాబితాలో ఆ దేశ అథ్లెట్లు చేరారు. ఒలింపిక్స్ కు వెళ్లే ముందు ఐదు స్వర్ణాలతో సహా 17 పతకాలు తేవాలని ఆజ్ఞాపించారు. కానీ ఆ దేశ అథ్లెట్లు రెండు స్వర్ణాలు సహా ఏడు పతకాలు మాత్రమే తెచ్చారు.
దీనికి తోడు దాయాది దేశం దక్షిణ కొరియా చేతిలో కొన్ని ఈవెంట్లలో ఓడిపోయారు. దీంతో కిమ్‌కు కోపమొచ్చింది. పతకాలు తేని అథ్లెట్లంతా వెళ్లి బొగ్గు గనుల్లో పని చేయాలని ఆదేశించారు.