'ఒలింపిక్స్లో రష్యా వద్దు' | Anti-doping bodies to seek Russia's ban from Rio Olympics: Reports | Sakshi
Sakshi News home page

'ఒలింపిక్స్లో రష్యా వద్దు'

Published Sun, Jul 17 2016 7:40 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

'ఒలింపిక్స్లో రష్యా వద్దు'

'ఒలింపిక్స్లో రష్యా వద్దు'

మాస్కో:ఇప్పటికే రష్యా అథ్లెట్ల  సమాఖ్యపై నిషేధం కొనసాగుతుండగా తాజాగా మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. అసలు రష్యా అథ్లెట్లను రియో ఒలింపిక్స్కు  అనుమతించకూడదనే వాదన బలంగా వినిపిస్తోంది. దాదాపు 10 జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రియోకు రష్యా దూరమయ్యే అవకాశం కనబడుతోంది. ప్రధానంగా యూఎస్, జర్మనీ, స్పెయిన్, జపాన్, స్విట్జర్లాండ్, కెనడా డోపింగ్ ఏజెన్సీలు రష్యాపై రియో నిషేధం విధించాలని కోరుతున్నాయి. ఆయా దేశాలు తమ డిమాండ్ను అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ) దృష్టికి తీసుకువెళ్లిన విషయం బయటకు పొక్కడంతో రష్యా అథ్లెట్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.


అంతకుముందు రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై నిషేధం విధించడంతో పాటు ఆ దేశ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (ఆర్‌యూఎస్‌ఏడీఏ)పై కూడా వేటు పడిన సంగతి తెలిసిందే. నిబంధనలకు అనుగుణంగా ఈ ఏజెన్సీ పనిచేయకపోవడంతో సస్పెండ్ చేయాలని వాడా ఫౌండేషన్ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. కాగా, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ తమ అథ్లెటిక్స్ సమాఖ్యపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ రష్యా ఒలింపిక్ కమిటీ స్విట్జర్లాండ్లోని క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై మరో రెండు రెండు రోజుల్లో విచారణ జరుగనున్న తరుణంలో రష్యా అథ్లెట్లపై ఒలింపిక్స్ నిషేధం విధించాలనే డిమాండ్ తెరపైకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement