
భారత జట్టులో రాష్ట్ర అథ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అథ్లెట్లు సుధాకర్, ప్రేమ్ ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జాతీయ జట్టుకి ఎంపికయ్యారు. భువనేశ్వర్‌లో జూలై 6 నుంచి 9 వరకు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో సుధాకర్ 4్ఠ400 మీ. విభాగంలో, ప్రేమ్ 110 మీ. హర్డిల్స్ విభాగంలో పోటీపడుతున్నారు. సుధాకర్ ఖమ్మం స్పోర్ట్స్ స్కూల్లో చదువుతుండగా.. ప్రేమ్ హైదరాబాద్‌లో ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్లో పనిచేస్తున్నాడు. తెలంగాణ కోచ్ నాగపురి రమేశ్ ఈ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు.
వీరు జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంగా తెలంగాణ క్రీడాశాఖ మంత్రి టి.పద్మారావు, స్పోర్ట్స్ సెక్రటరీ వెంకటేశం, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు ఆటగాళ్లను, కోచ్‌ను అభినందించారు. వారు తమ ప్రతిభతో రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తున్నారని.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం సుధాకర్, ప్రేమ్‌లతో పాటు కోచ్ రమేశ్‌కు లక్ష రూపాయల నజరానా ప్రకటించింది. ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి వీరిని అభినందిస్తూ.. ఈ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.