cm cup
-
ఫుట్‌బాల్ టీమ్‌ను దత్తత తీసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. క్రీడల అభివృద్ధికి ఇప్పటికే ప్రకటించిన పలు ప్రణాళికలతో పాటు మరిన్ని కొత్త అంశాలతో ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే చీఫ్ మినిస్టర్స్ (సీఎం) కప్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ‘పల్లెల నుంచి ప్రపంచ స్థాయి విజేతల కొరకు’ అనే నినాదంతో త్వరలోనే జరగనున్న ఈ టోర్నీకి సంబంధించిన లోగో, మస్కట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నాలుగు దశల్లో జరిగే టోర్నీ అక్టోబర్ 21న ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను టోర్నీ మస్కట్‌గా ఉంచి దానికి ‘నీలమణి’ అని పేరు పెట్టారు. ఇటీవల కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చిన సమయంలో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధికారులతో చర్చించామని.. దానికి అనుగుణంగా భారత్ అండర్–17 ఫుట్‌బాల్ టీమ్‌ను దత్తత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గోవాలో జరిగిన జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన, గత ఏడాది జరిగిన సీఎం కప్‌లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కలిపి మొత్తం రూ.1.02 కోట్లు, రూ.52 లక్షలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ఈ కార్యక్రమంలో సీఎం అందజేశారు. ప్రతిభకు గుర్తింపుగా బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్‌లను ప్రభుత్వ ఉద్యోగంతో గౌరవించిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. కార్యక్రమంలో నిఖత్ జరీన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. భవిష్యత్తులో ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, శాసన సభ్యులు వివేక్, రాంచంద్ర నాయక్, ప్రభుత్వ సలహాదారులు జితేందర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, పార్లమెంటు సభ్యులు అనిల్‌కుమర్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ జితేందర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, సాంస్కృతిక పర్యాటక శాఖ కార్యదర్శి వాణిప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారిలతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ఎన్సీసీ అధికారులు పాల్గొన్నారు. -
CM Cup : అట్టహాసంగా సీఎం కప్ ఆరంభ వేడుకలు (ఫొటోలు)
-
తిరుపతిలో సీఎం కప్ ఫైనల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘సీఎం కప్’ టోర్నీ ఫైనల్స్‌ను తిరుపతి వేదికగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు 14 క్రీడాంశాల్లోనూ స్టేట్ మినీ ఒలింపిక్స్ మాదిరిగా ఒకే ప్రాంతంలో పోటీలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే జిల్లాస్థాయిలో పోటీల్లో గెలుపొందిన జట్ల వివరాలను పంపించాలని డీఎస్ఏలు, చీఫ్ కోచ్‌లను శాప్ ఆదేశించింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 4,200 మందికిపైగా క్రీడాకారులు సీఎం కప్ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్నారు. మొత్తం టోర్నీలో 963 పతకాలు, 48 ట్రోఫీలను బహూకరించనున్నారు. ఏపీ భవన్లో విద్యుత్ పొదుపు ప్రాజెక్ట్ 2030 నాటికి బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా కేంద్ర విద్యుత్‌శాఖ నేతృత్వంలోని బీఈఈ న్యూఢిల్లీలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యలపై దృష్టి సారించింది. మొదటిదశలో ఏపీ భవన్ నుంచి ఇంధన సామర్థ్య పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విడదల రజిని చెప్పారు. గుంటూరు శివారు అమరావతి రోడ్డులో ఆదివారం బీపీ మండల్ కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో మంత్రులు మాట్లాడారు. -
బాక్సింగ్ రింగులో పంచులు కురిపించిన రోజా (ఫొటోలు)
-
RK Roja: బాక్సింగ్ రింగులో మంత్రి రోజా పవర్ఫుల్ పంచ్‌లు
విశాఖ స్పోర్ట్స్ : గెలుపోటములు సహజం.. జాతీయ స్థాయి పోటీకి ఎదగడం గెలుపుతో సమానమని రాష్ట్ర పర్యాటక క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. ఆలిండియా ఆహ్వాన సీఎం కప్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలను సాగరతీరంలోని ఫ్లడ్‌లైట్ వెలుతురుతో ఆదివారం రాత్రి ఆమె ప్రారంభించారు. ఏ రంగంలోనైనా విజేతగా నిలవాలంటే పట్టుదల ఉండాలన్నారు. బాక్సింగ్ క్రీడలో రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్‌కోసం మంత్రి అమర్నాథ్తో కలిసి ఈ ప్రాంగణం నుంచే ఉద్యమించామని, రాజధానికి కోసం విశాఖ గర్జనలో పాల్గొన్నానని రోజా గుర్తు చేశారు. అంతేకాకుండా తన సినీ కెరీర్ ప్రారంభం నుంచి విశాఖ ప్రజలతో అనుబంధం ఉందన్నారు. విశాఖ వాసుల కష్టసుఖాల్లో తాను తోడుంటానని స్పష్టం చేశారు. క్రీడాకారులు, కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోదన్నారు. కాసేపు బాక్సింగ్ గ్లోవ్స్ ధరించి అతిథులతోనూ పంచ్‌లు విసురుతూ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలకు విశాఖ వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన వారికి గ్రూప్‌వన్ అధికారుల్ని చేయడం సీఎం జగన్ మోహన్‌రెడ్డికి క్రీడాకారులపై ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. టోర్నీ నిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్రమారిటైమ్ బోర్డ్ చైర్మన్ కాయల వెంకటరెడ్డి మాట్లాడుతూ గతేడాది ఇదే వేదికపై రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించామని ఇప్పుడు జాతీయ ఆహ్వాన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్ర ఆటగాడు బోయ అర్జున్, తెలంగాణ కు చెందిన భరణిప్రసాద్ మధ్య తొలి బౌట్‌ను అతిథులు ప్రారంభించడంతో చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ రవిబాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు, టోర్ని నిర్వాహక ప్రతినిధి కాయల సూర్యారెడ్డి పాల్గొన్నారు. ఈ చాంపియన్‌షిప్‌లో 14 రాష్ట్రాలకు చెందిన బాక్సర్లు సబ్‌జూనియర్, జూనియర్, యూత్, ఎలైట్ గ్రూప్‌ల్లో పోటీపడనున్నారు. -
తిరుపతిలో సీఎం కప్ పోటీలు ప్రారంభించిన ఎంపీ గురుమూర్తి
-
‘సీఎం కప్ గెలిస్తే.. నా రెండు నెలల వేతనం ఇస్తా’
పలమనేరు: పలమనేరు నియోజకవర్గ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ సాధిస్తే రూ.10 లక్షలు బహుమానంగా అందజేస్తానని స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ప్రకటించారు. పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియోజకవర్గస్థాయి సీఎం కప్ పోటీలను బుధవారం ఆయన క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాలీ బాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కప్ పోటీల ఆవశ్యకతను ఎంపీడీఓ విద్యాసాగర్, ఎంఈఓ లీలారాణి వివరించారు. ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఈ నియోజకవర్గం నుంచి విజేతలకు తన రెండునెలల గౌరవవేతనాన్ని అందజేస్తానని ప్రకటించారు. మానసిక వికాసానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు మురళీకృష్ణ, రంగన్న, ఎంపీపీ రోజా, కన్వీనర్లు మండీసుధా, బాలాజీనాయుడు, జిల్లా కార్యదర్శులు విశ్వనాథ రెడ్డి, చెంగారెడ్డి, హేమంత్‌రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్లు, కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని ఎంఈఓలు, పీడీ, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. సూపర్‌కిడ్ వేదాఇవాంజెల్కు అభినందనలు.. పలమనేరు పట్టణానికి చెందిన సూపర్‌కిడ్ వేదాఇ వాంజెల్ చిన్నవయసులో అమోఘమైన జ్ఞాపకశక్తిని చూపుతూ జాతీయస్థాయిలో ఓఎంజీ రికార్డును సాధించిన విషయం తెలిసిందే. పలమనేరుకు పేరు తెచ్చి పెట్టిన బాలికను ఎమ్మెల్యే ఎత్తుకుని అభినందించారు. పోటాపోటీగా సీఎం కప్ క్రీడాపోటీలు తవణంపల్లె: అరగొండ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం మండలస్థాయి సీఎం కప్ క్రీడాపోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను నియోజకవర్గస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేశారు. విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి గంగాధరనెల్లూరు: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో సైతం రాణించాలని ఎంపీపీ అనిత పిలుపునిచ్చారు. స్థానిక జెడ్పీ ఉన్నతపాఠశాల ఆవరణలో బుధవారం సీఎం కప్ పోటీలను వాలీబాల్ ప్రారంభించారు. ఎంఈఓ రాజేంద్రప్రసాద్, వైస్ ఎంపీపీ హరిబాబు, దినకర్, పీడీలు పాల్గొన్నారు. సీఎం కప్ క్రీడాకారుల ఎంపిక శ్రీరంగరాజపురం: మండలస్థాయి సీఎం కప్ క్రీడాకారులు ఎంపిక రేపటి నుంచి 18వ తేదీ వరకు ఎస్సార్ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతుందని ఇన్చార్జ్ ఏఓ కృష్ణయ్య తెలిపారు. వివరాలకోసం 9704112275ను సంప్రదించాలన్నారు. క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి చిత్తూరు రూరల్: క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని ఎంపీడీఓ వెంకటరత్నం, ఎంఈఓ సెల్వరాజ్ అన్నారు. చిత్తూరులోని మెసానికల్ మైదానంలో బుధవారం మండలస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించారు. వైఎస్సార్సీపీ నేతలు సంపత్, వైస్ ఎంపీపీ జయరామ్ పాల్గొన్నారు. సీఎం కప్ పోటీల విజేతలు వీరే.. వి.కోట: నియోజకవర్గస్థాయి ఏïపీ సీఎం కప్ పోటీల్లో వి.కోట మండల జట్లు విజేతలుగా నిలవగా పలువురు అభినందనలు తెలిపారు. ఎంఈఓ చంద్రశేఖర్ వి.కోట మండలానికి చెందిన విజేతలు మూడు పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులను జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎంపీపీ యువరాజ్, అధికారులు అభినందించారు. -
సీఎం పేరు మీద క్రీడలు జరగడం ఇదే తొలిసారి
-
సీఎం కప్పు..చేయించింది అప్పు..!
సాక్షి, రాయవరం (మండపేట): స్కూల్ గేమ్స్‌ను సీఎం కప్‌గా నామకరణం చేసి క్రీడా పోటీలు నిర్వహించారు. పేరు మారినా..తీరు మారలేదు. నిధులు మంజూరు చేస్తాం..క్రీడలు ఆడించండంటూ అధికారులు చెప్పడంతో పాఠశాలల్లో పనిచేసే పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ) జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టారు. స్కూల్ గేమ్స్‌ను పూర్తి చేసి నెలలు గడుస్తున్నా..నేటికీ పైసా విడుదల కాకపోవడంతో అప్పులు చేసి తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని తలలు పట్టుకుంటున్నారు. డిసెంబరుతో ముగిసిన పోటీలు... విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ పేరుతో క్రీడా పోటీలను నిర్వహించింది. సెప్టెంబరు 24వ తేదీ నుంచి జిల్లాలో ఎస్జీఎఫ్ పోటీలు ప్రారంభించారు. తొలుత మండల స్థాయి, అనంతరం నియోజకవర్గ స్థాయి, తదనంతరం జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీలు నవంబరులో జరిగాయి. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయిలో ఆడించారు. జాతీయ స్థాయి పోటీలు డిసెంబర్లో ముగిశాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా సీఎం కప్ క్రీడా పోటీలు అండర్–14, అండర్–17 విభాగాల్లో మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలను నిర్వహించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి అండర్–14, అండర్–17 పోటీలు నిర్వహించారు. ఇంటర్ విద్యార్థులకు అండర్–19 పోటీలు నిర్వహించారు. ఆడించే ఆటలివే మండల స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్, త్రోబాల్, బాల్‌బాడ్మింటన్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్, యోగా పోటీలను నిర్వహించగా, జిల్లా స్థాయిలో ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, బాస్కెట్‌బాల్, నెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, కత్తి సాము, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్ తదితర 41 క్రీడలను ఆడించారు. తలకు మించిన భారంగా మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలు పూర్తయి ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. క్రీడల్లో పాల్గొనే ప్రతి విద్యార్థికీ టీఏ రూ.30, డీఏ రూ.30ల వంతున మంజూరు చేయాల్సి ఉంది. దీని ప్రకారం మండలానికి రూ.50 వేలు, నియోజకవర్గ స్థాయి పోటీలకు రూ.50 వేలు విడుదల చేయాల్సి ఉంది. జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు ఒక్కో విద్యార్థికి టీఏ రూ.50, డీఏ రూ.50ల వంతున మంజూరు చేయాల్సి ఉంది. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి పోటీల నిమిత్తం జిల్లాకు రూ.40.5 లక్షలు, జిల్లా స్థాయి పోటీలకు రూ.2 లక్షలు విడుదల కావాల్సి ఉంది. జిల్లాలోని జి.మామిడాడలో వెయిట్‌లిఫ్టింగ్, కాకినాడలో జిమ్నాస్టిక్స్, అనపర్తిలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల నిర్వహణ, జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయడం, వారిని జాతీయ స్థాయి పోటీలకు గౌహతి, అగర్తల, జామ్‌నగర్‌కు పంపించారు. కోసం దాదాపు రూ.15 లక్షలు మంజూరు కావాల్సి ఉంది. ఈ విధంగా జిల్లాకు రూ.60 లక్షలు విడుదల కావాల్సి ఉండగా, నేటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఇచ్చేదే అరకొర... క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం కంటితుడుపు చర్యగా, అరకొరగా నిధులు కేటాయిస్తోంది. ఆ అరకొర నిధులు కూడా క్రీడాపోటీలు ముగిసి మూడు నెలలవుతున్నా నేటికీ ఒక్క రూ పాయి విడుదల కాలేదు. చాలా మంది పీఈటీలు, పీడీలు వడ్డీ కి అప్పులు తీసుకుని వచ్చి, పెట్టుబడి పెట్టారు. ఓ వైపు తెచ్చి న డబ్బులకు రోజు రోజుకూ వడ్డీలు పెరుగుతుంటే, వీరికి తలకు మించిన భారంగా మారుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్జీఎఫ్ నిధులు విడుదల చేయాలని పీఈటీలు, పీడీలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా అయితే మెరుగైన క్రీడాకారులను ఎలా తయారు చేయగలమని పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల కాకపోవడం వాస్తవమే... సీఎం కప్ క్రీడా పోటీలకు ఇప్పటి వరకు నిధులు విడుదల కాని విషయం వాస్తవమే. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోటీలు పూర్తి చేసినా డబ్బులు విడుదల కాలేదు. పెట్టుబడి పెట్టిన డబ్బులకు వడ్డీలు పెరగడంతో పీఈటీలు, పీడీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – రాజశేఖర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు, పీఈటీ, పీడీ అసోసియేషన్, కాకినాడ -
ఎస్ఎస్సీ గెలుపు
సాక్షి, హైదరాబాద్: పోలో సీజన్-2013లో సునీంద్ర స్పోర్ట్స్ కార్పొరేషన్ (ఎస్ఎస్సీ) జట్టు జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రిన్స్ ఆఫ్ బేరార్ కప్, సీఎం కప్‌లను సొంతం చేసుకున్న ఎస్ఎస్సీ, బైసన్ ట్రోఫీలోనూ శుభారంభం చేసింది. సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో గ్రౌండ్స్‌లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఎస్ఎస్సీ (బ్లాక్) 11-2 గోల్స్ తేడాతో సీ డ్రాగన్స్‌ను చిత్తు చేసింది. ఎస్ఎస్సీ తరఫున ధ్రువ్పాల్ గొదారా ఒక్కడే 9 గోల్స్ చేయడం విశేషం. మొదటి చకర్‌లో 3, రెండో చకర్‌లో 4 గోల్స్ చేసిన ధ్రువ్ మూడో చకర్‌లో మరో 2 గోల్స్ నమోదు చేశాడు. సూర్యబహదూర్, పాంచల్ చెరో గోల్ సాధించారు. నెగెటివ్ హ్యండిక్యాప్తో ప్రారంభించిన డ్రాగన్స్ జట్టు తరఫున ఎవరూ గోల్ చేయలేదు. కేవలం అడ్వాంటేజ్ రూపంలో ఆ జట్టు ఖాతాలో రెండు గోల్స్ నమోదయ్యాయి. మరో మ్యాచ్‌లో ఫోర్సెస్ 5-4 తేడాతో డీపీఆర్సీపై విజయం సాధించింది. ఫోర్సెస్ తరఫున విజయ్ సింగ్ 3, రాంసింగ్ 2 గోల్స్ చేయగా...డీపీఆర్సీ తరఫున ధనంజయ్ 2, సలీమ్, అబ్దుల్లా చెరో గోల్ చేశారు.