పలమనేరు: పలమనేరు నియోజకవర్గ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ సాధిస్తే రూ.10 లక్షలు బహుమానంగా అందజేస్తానని స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ప్రకటించారు. పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియోజకవర్గస్థాయి సీఎం కప్ పోటీలను బుధవారం ఆయన క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాలీ బాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కప్ పోటీల ఆవశ్యకతను ఎంపీడీఓ విద్యాసాగర్, ఎంఈఓ లీలారాణి వివరించారు.
ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఈ నియోజకవర్గం నుంచి విజేతలకు తన రెండునెలల గౌరవవేతనాన్ని అందజేస్తానని ప్రకటించారు. మానసిక వికాసానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు మురళీకృష్ణ, రంగన్న, ఎంపీపీ రోజా, కన్వీనర్లు మండీసుధా, బాలాజీనాయుడు, జిల్లా కార్యదర్శులు విశ్వనాథ రెడ్డి, చెంగారెడ్డి, హేమంత్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్లు, కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని ఎంఈఓలు, పీడీ, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
సూపర్‌కిడ్ వేదాఇవాంజెల్‌కు అభినందనలు..
పలమనేరు పట్టణానికి చెందిన సూపర్‌కిడ్ వేదాఇ వాంజెల్ చిన్నవయసులో అమోఘమైన జ్ఞాపకశక్తిని చూపుతూ జాతీయస్థాయిలో ఓఎంజీ రికార్డును సాధించిన విషయం తెలిసిందే. పలమనేరుకు పేరు తెచ్చి పెట్టిన బాలికను ఎమ్మెల్యే ఎత్తుకుని అభినందించారు.
పోటాపోటీగా సీఎం కప్ క్రీడాపోటీలు
తవణంపల్లె: అరగొండ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం మండలస్థాయి సీఎం కప్ క్రీడాపోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను నియోజకవర్గస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేశారు.
విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
గంగాధరనెల్లూరు: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో సైతం రాణించాలని ఎంపీపీ అనిత పిలుపునిచ్చారు. స్థానిక జెడ్పీ ఉన్నతపాఠశాల ఆవరణలో బుధవారం సీఎం కప్ పోటీలను వాలీబాల్ ప్రారంభించారు. ఎంఈఓ రాజేంద్రప్రసాద్, వైస్ ఎంపీపీ హరిబాబు, దినకర్, పీడీలు పాల్గొన్నారు.
సీఎం కప్ క్రీడాకారుల ఎంపిక
శ్రీరంగరాజపురం: మండలస్థాయి సీఎం కప్ క్రీడాకారులు ఎంపిక రేపటి నుంచి 18వ తేదీ వరకు ఎస్సార్ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతుందని ఇన్‌చార్జ్ ఏఓ కృష్ణయ్య తెలిపారు. వివరాలకోసం 9704112275ను సంప్రదించాలన్నారు.
క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి
చిత్తూరు రూరల్: క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని ఎంపీడీఓ వెంకటరత్నం, ఎంఈఓ సెల్వరాజ్ అన్నారు. చిత్తూరులోని మెసానికల్ మైదానంలో బుధవారం మండలస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ నేతలు సంపత్, వైస్ ఎంపీపీ జయరామ్ పాల్గొన్నారు.
సీఎం కప్ పోటీల విజేతలు వీరే..
వి.కోట: నియోజకవర్గస్థాయి ఏïపీ సీఎం కప్ పోటీల్లో వి.కోట మండల జట్లు విజేతలుగా నిలవగా పలువురు అభినందనలు తెలిపారు. ఎంఈఓ చంద్రశేఖర్ వి.కోట మండలానికి చెందిన విజేతలు మూడు పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులను జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎంపీపీ యువరాజ్, అధికారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment