శాప్ చైర్మన్‌గా పీఆర్ మోహన్ | PR Mohan as SAP chairman | Sakshi
Sakshi News home page

శాప్ చైర్మన్‌గా పీఆర్ మోహన్

Published Thu, Jan 29 2015 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

PR Mohan as SAP chairman

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్‌గా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన పీఆర్ మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శి శశాంక్ గోయల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మోహన్ గతంలో ఎన్టీఆర్ హయాంలో శాప్, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా పని చేశారు. శాప్ సభ్యులుగా వెయిట్‌లిఫ్టర్  కరణం మల్లీశ్వరి (శ్రీకాకుళం), ఎస్.గీత (గుంటూరు),  కేఎం షకీల్ షఫీ (అనంతపురం), దుద్యాల జయచంద్ర (వైఎస్సార్ జిల్లా), బండారు హనుమంతురావు (కృష్ణా), ఎం.రవీంద్రబాబు (నెల్లూరు)లను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement