ఎస్‌ఏపీతో క్యాప్‌జెమినీ జట్టు.. 8,000 మందికి ట్రైనింగ్‌ | Capgemini, SAP tie up To Skill 8000 Marginalised Youth In India | Sakshi
Sakshi News home page

ఎస్‌ఏపీతో క్యాప్‌జెమినీ జట్టు.. 8,000 మందికి ట్రైనింగ్‌

Published Thu, Aug 22 2024 7:28 AM | Last Updated on Thu, Aug 22 2024 9:12 AM

Capgemini, SAP tie up To Skill 8000 Marginalised Youth In India

ముంబై: ఐటీ దిగ్గజం క్యాప్‌జెమినీ తాజాగా ఎస్‌ఏపీ ల్యాబ్స్‌తో చేతులు కలిపింది. వచ్చే మూడేళ్లలో దేశీయంగా 8,000 మంది వెనుకబడిన యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు క్యాప్‌జెమినీ–ఎస్‌ఏపీ డిజిటల్‌ అకాడెమీ ప్రోగ్రాంను అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.

దీని ప్రకారం ఇరు సంస్థలు సంయుక్తంగా వనరుల సమీకరణ, నెట్‌వర్క్‌లు మొదలైన వాటిపై ఇన్వెస్ట్‌ చేస్తాయని క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో అశ్విన్‌ యార్డి తెలిపారు. తమ కెరియర్‌లలో విజయాలను అందుకునేందుకు దేశ యువతకు సాధికారత కల్పించేందుకు ఈ భాగస్వామ్యం సహాయకరంగా ఉండగలదని ఎస్‌ఏపీ ల్యాబ్స్‌ ఇండియా ఎండీ సింధు గంగాధరన్‌ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement