PR Mohan
-
అగ్ని ప్రమాదం బాధాకరం: మంత్రి
శ్రీకాళహస్తి: అగ్నిప్రమాదం సంభవించి రాజగోపురం వద్ద యాగశాల దగ్ధం కావడం బాధాకరమని దేవాదాయశాఖ మంత్రి మణిక్యాలరావు అన్నారు. శనివారం ఆయన మహాకుంభాభిషేకంపై దేవస్థానంలో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసిన తర్వాత ఆలయంలో పనులు పరిశీలించారు. తర్వాత గాలిగోపురాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. మహాకుంభిషేకం చేస్తున్న నేపథ్యంలో ఇలా గాలిగోపురం వద్ద అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. అయితే శివపార్వతుల ఆశీస్సులతో ఎవరికి ప్రమాదం జరగలేదన్నారు. ఆయన వెంట ఈవో భ్రమరాంబ, ఆలయ మాజీ చైర్మన్ కోలా ఆనంద్, ఆలయ సభ్యురాలు కండ్రిగ ఉమ, శాప్ చైర్మన్ పీఆర్ మోహన్, ఈఈ వెంకటనారాయణ తదితరులున్నారు. అమ్మవారికి బంగారు మకరతోరణం శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి బంగారు తాపడం చేసిన మకర తోరణాన్ని అమ్మవారికి కానుకగా ఇచ్చారు. బంగారు తాపడం చేయించడానికి అమ్మవారి రాగి మకరతోరణాన్ని రవిసన్నారెడ్డికి అప్పగించారు. ఆయన దానికి బంగారు తాపడం చేయించి దేవస్థానానికి శనివారం అందజేశారు. ఆలయంలో విద్యుత్ దీపాలంకరణ మహాకుంభాభిషేకంలో భాగంగా ముక్కంటి ఆలయానికి విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. గోపురాలను ముస్తాబు చేశారు. ఆలయ ఆవరణలో శివపార్వతుల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. -
కొమ్మాదిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమి
విశాఖపట్నం: ఇకపై తమ సంస్థ ద్వారా జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్ని తెలుగులోనే జరుగుతాయని శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో ప్రభుత్వ అతిథి గృహంలో శాప్ 3వ సమావేశంలో పీఆర్ మోహన్ మాట్లాడారు. వ్యాయామ విద్య నిర్బంధ విద్యగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొమ్మాదిలో రూ. 15 కోట్ల కేంద్ర నిధులతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మూత పడిన స్పోర్ట్స్ అకాడమీలను పునః ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారుల సాయంతో ఏపీ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తామని శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ వెల్లడించారు. -
శాప్ చైర్మన్‌గా పీఆర్ మోహన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్‌గా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన పీఆర్ మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శి శశాంక్ గోయల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మోహన్ గతంలో ఎన్టీఆర్ హయాంలో శాప్, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా పని చేశారు. శాప్ సభ్యులుగా వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి (శ్రీకాకుళం), ఎస్.గీత (గుంటూరు), కేఎం షకీల్ షఫీ (అనంతపురం), దుద్యాల జయచంద్ర (వైఎస్సార్ జిల్లా), బండారు హనుమంతురావు (కృష్ణా), ఎం.రవీంద్రబాబు (నెల్లూరు)లను నియమించారు.