న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ మహిళల రికర్వ్ ఆర్చరీ విభాగంలో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. గత మూడు నెలలుగా కొనసాగిన సెలెక్షన్ ట్రయల్స్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ ముగ్గురిని ఎంపిక చేశామని భారత ఆర్చరీ సంఘం తెలిపింది. ఈ ముగ్గురు టీమ్ విభాగంతోపాటు వ్యక్తిగత విభాగంలోనూ బరిలోకి దిగుతారు. గతేడాది డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు రజతం నెగ్గడంతో టీమ్ విభాగంతోపాటు వ్యక్తిగత విభాగంలో రియో బెర్త్‌లు ఖరారయ్యాయి.