Bombela Devi
-
దీపిక బృందం ఖరారు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ మహిళల రికర్వ్ ఆర్చరీ విభాగంలో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. గత మూడు నెలలుగా కొనసాగిన సెలెక్షన్ ట్రయల్స్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ ముగ్గురిని ఎంపిక చేశామని భారత ఆర్చరీ సంఘం తెలిపింది. ఈ ముగ్గురు టీమ్ విభాగంతోపాటు వ్యక్తిగత విభాగంలోనూ బరిలోకి దిగుతారు. గతేడాది డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు రజతం నెగ్గడంతో టీమ్ విభాగంతోపాటు వ్యక్తిగత విభాగంలో రియో బెర్త్‌లు ఖరారయ్యాయి. -
భారత్‌కు మూడు పతకాలు
షాంఘై: కొత్త సీజన్లో భారత ఆర్చర్లు ఆకట్టుకున్నారు. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నమెంట్లో మనోళ్లకు మూడు పతకాలు లభించాయి. దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల జట్టు రికర్వ్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది. చైనీస్ తైపీతో జరిగిన ఫైనల్లో టీమిండియా 2-6 స్కోరుతో ఓడిపోయింది. జయంత తాలుక్దార్, మంగళ్ సింగ్, అతాను దాస్లతో కూడిన భారత పురుషుల జట్టు రికర్వ్ టీమ్ విభాగం కాంస్య పతక పోరులో 6-0తో బ్రిటన్‌పై గెలిచింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో దీపిక, అతాను దాస్లతో కూడిన భారత జోడీకి కాంస్యం దక్కింది. కాంస్య పతక మ్యాచ్‌లో దీపిక-అతాను ద్వయం 5-4తో అరెయుమ్ -సియోంగ్ (కొరియా) జంటను ఓడించింది. -
పసిడి పోరుకు అర్హత
► టీమ్ ఫైనల్లో భారత మహిళల జట్టు ► ప్రపంచకప్ ఆర్చరీ షాంఘై (చైనా): వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచిన భారత మహిళా ఆర్చర్లు జట్టుగా మాత్రం రాణించారు. దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి మాఝీలతో కూడిన భారత జట్టు ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్లో రికర్వ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 5-3తో టాప్ సీడ్ జర్మనీ జట్టును బోల్తా కొట్టించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 5-4తో చైనాపై గెలుపొందగా... తొలి రౌండ్లో 6-0తో అమెరికాను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో చైనీస్ తైపీ జట్టుతో దీపిక బృందం పోటీపడుతుంది. మరోవైపు పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో మంగళ్ సింగ్ చంపియా, అతాను దాస్, జయంత తాలుక్దార్లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం కోసం ఆడనుంది. సెమీఫైనల్లో భారత్ 4-5తో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఆదివారం జరిగే కాంస్య పతక పోటీలో బ్రిటన్‌తో భారత్ తలపడుతుంది.