భారత్‌కు మూడు పతకాలు | Three medals for India | Sakshi
Sakshi News home page

భారత్‌కు మూడు పతకాలు

Published Mon, May 2 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

భారత్‌కు   మూడు పతకాలు

భారత్‌కు మూడు పతకాలు

షాంఘై: కొత్త సీజన్‌లో భారత ఆర్చర్లు ఆకట్టుకున్నారు. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నమెంట్‌లో మనోళ్లకు మూడు పతకాలు లభించాయి. దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల జట్టు రికర్వ్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది. చైనీస్ తైపీతో జరిగిన ఫైనల్లో టీమిండియా 2-6 స్కోరుతో ఓడిపోయింది.

జయంత తాలుక్‌దార్, మంగళ్ సింగ్, అతాను దాస్‌లతో కూడిన భారత పురుషుల జట్టు రికర్వ్ టీమ్ విభాగం కాంస్య పతక పోరులో 6-0తో బ్రిటన్‌పై గెలిచింది. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో దీపిక, అతాను దాస్‌లతో కూడిన భారత జోడీకి కాంస్యం దక్కింది. కాంస్య పతక మ్యాచ్‌లో దీపిక-అతాను ద్వయం 5-4తో అరెయుమ్ -సియోంగ్ (కొరియా) జంటను ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement