దీపికకు కాంస్యం | Bronze medal to deepika kumari | Sakshi
Sakshi News home page

దీపికకు కాంస్యం

Published Mon, Jun 1 2015 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

Bronze medal to deepika kumari

అంటాల్యా (టర్కీ) : ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత స్టార్ క్రీడాకారిణి దీపిక కుమారి కాంస్య పతకం సాధించింది. ఆదివారం జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతక పోరులో దీపిక 6-2తో జిన్ హై చాంగ్ (దక్షిణ కొరియా)పై గెలుపొందింది. మొత్తం నాలుగు రౌండ్‌లపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దీపిక మూడు రౌండ్లలో ఆధిక్యంలో నిలి చింది. ఒక్కో రౌండ్‌కు రెండు పాయింట్లు ఇస్తారు. ఓవరాల్‌గా దీపిక 26-25, 29-26, 26-28, 28-27 స్కోరుతో జిన్ హై చాంగ్‌ను ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement