చండీగఢ్ యూనివర్సిటీ ఘనత
పారిస్ ఒలింపిక్స్‌కు ఎనిమిది మంది ఆటగాళ్లు
చండీగఢ్: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందంలో ఒకే యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఉండటం విశేషం. చండీగఢ్ యూనివర్సిటీకి అలాంటి అరుదైన అవకాశం దక్కింది.
ఈ యూనివర్సిటీ విద్యార్థులు భజన్ కౌర్ (ఆర్చరీ), అర్జున్ (షూటింగ్), సంజయ్ (హాకీ), రితిక (రెజ్లింగ్), అక్ష్‌దీప్ సింగ్ (రేస్ వాకింగ్), యశ్ (కయాకింగ్)లతో పాటు పారాలింపియన్లు పలక్ కోహ్లి (బ్యాడ్మింటన్), అరుణ తన్వర్ (తైక్వాండో) ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఈ గౌరవం పట్ల చండీగఢ్ యూనివర్సిటీ చాన్స్‌లర్, ఎంపీ సత్నామ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.
క్వార్టర్ ఫైనల్లో అనాహత్, శౌర్య
ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఇద్దరు భారత క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించారు. అమెరికాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో బాలికల సింగిల్స్‌లో జాతీయ చాంపియన్ అనాహత్ సింగ్... బాలుర సింగిల్స్‌లో శౌర్య బావా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అనాహత్ 11–6, 13–11, 11–2తో అకారి మిదోరికావా (జపాన్)పై, శౌర్య 11–9, 5–11, 11–5, 13–11తో సెగుండో పొర్టాబాలెస్ (అర్జెంటీనా)పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment