క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌ | Saina Nehwal In Quarters of Asian Games | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌

Published Sat, Aug 25 2018 12:42 PM | Last Updated on Sat, Aug 25 2018 12:43 PM

Saina Nehwal In Quarters of Asian Games - Sakshi

జకార్తా: ఏషియన్‌ గేమ్స్‌ 2018 బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ క్వార్టర్స్‌కు చేరారు. శనివారం జరిగిన సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌ 21-6, 21-14 తేడాతో ఫిత్రియాని(ఇండోనేసియా)పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సైనా.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదురైంది. కాగా, రెండో గేమ్‌ను 21-14 తేడాతో గెలిచిన సైనా క్వార్టర్స్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఇక ఆర్చరీ రికర్వ్‌ విభాగంలో భారత మహిళల జట్టు కథ క్వార్టర్స్‌లోనే ముగిసింది.  ఈ రోజు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత జట్టు 2-6 తేడాతో చైనీస్‌ తైపీ జట్టు చేతిలో ఓటమి పాలైంది.

సింధు శ్రమించి... సైనా అలవోకగా... 

శ్రీకాంత్, ప్రణయ్‌ నిష్క్రమణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement