జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం మహిళల టీమ్ ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 1-3 తేడాతో జపాన్ చేతిలో ఓటమి పాలైంది. ఫలితంగా స్వర్ణ పతక రేసులో నిలుస్తుందన్న భారత మహిళల విభాగం ఆశలు క్వార్టర్స్‌లోనే ఆవిరయ్యాయి.
తొలి మ్యాచ్‌లో పీవీ సింధు గెలిచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది. పీవీ సింధు 21-18, 21-19తో యమగూచిపై విజయం నమోదు చేసింది. కానీ, ఆ తర్వాత భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలవ్వడంతో మహిళల టీమ్ ఈవెంట్ నుంచి భారత నిష్ర్కమించాల్సి వచ్చింది. డబుల్స్ విభాగంలో సిక్కిరెడ్డి- ఆరతి జోడి15-21, 6-21తో ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడంతో భారత్ ఆధిక్యానికి తెరపడింది.
మరో సింగిల్స్‌లో సైనా 11-21, 25-23, 16-21 తేడాతో ఒకుహార చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత తప్పక గెలవాల్సిన మరో డబుల్స్‌లో సింధు-పొన్నప్ప జోడి కూడా ఓడిపోయింది. దీంతో ఈ ఆసియా క్రీడల్లో మహిళల టీమ్ ఈవెంట్‌లో భారత మహిళల పోరుకు తెర పడింది.
Comments
Please login to add a commentAdd a comment