ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఆర్చరీలో తొలి ఒలింపిక్స్ కోటా బెర్తును తెచ్చి పెట్టాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో ధీరజ్ రజతం సాధించాడు. ఫైనల్లో స్వర్ణ పతకంపై గురిపెట్టిన 22 ఏళ్ల తెలుగు కుర్రాడు 5–6తో జి సియాంగ్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడి... రజతంతో సరిపెట్టుకున్నాడు.
అంతకుముందు క్వార్టర్స్‌లో ధీరజ్ 6–0తో సాదిగ్ అష్రాఫి బవిలి (ఇరాన్)పై, సెమీ ఫైనల్లో 6–0తో మొహమ్మద్ హొస్సేన్ గొల్షాని (ఇరాన్)పై విజయం సాధించాడు. ఈ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన ఇద్దరికి మాత్రమే ఒలింపిక్స్ కోటా బెర్తు లభిస్తుంది. మహిళల విభాగంలో అంకిత భకత్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోవడంతో బెర్తు దక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment