
మణిపూర్ జట్టుకు టైటిల్
తెలంగాణ ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మణిపూర్ మహిళల జట్టు సత్తా చాటింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మణిపూర్ మహిళల జట్టు సత్తా చాటింది. సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్స్‌లో జరిగిన ఈ టోర్నీలో మహిళల టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విభాగంలో ఆలిండియా పోలీస్ జట్టు రజతాన్ని గెలుచుకుంది. పురుషుల టీమ్ విభాగంలో సర్వీసెస్ జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకోగా, అస్సాం, మేఘాలయ జట్లు రజత, కాంస్య పతకాలను సాధించాయి. ఇండియన్ రౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం జట్లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మహిళల కాంపౌండ్ విభాగంలోనూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన జ్యోతి బలియన్ స్వర్ణాన్ని గెలుచుకోగా, జార్ఖండ్‌కు చెందిన కళ్యాణి కుమారి రజతాన్ని దక్కించుకుంది. సోన్‌మతి (ఛత్తీస్‌గఢ్) కాంస్య పతకాన్ని సాధించింది.
ఇతర విభాగాల విజేతల వివరాలు
పురుషుల రికర్వ్: 1. రాజేశ్ (హరియాణా), 2. హర్వీందర్ సింగ్ (హరియాణా), 3. కుల్దీప్ శర్మ (హరియాణా).
మహిళల ఇండియన్ రౌండ్: 1. మాలేసోరి దేవి (మణిపూర్), 2. టూటూమోని బోరో (అస్సాం), 3. దేబియా దేవి (మణిపూర్).