‘‘పసి పిల్లల మనసు, శరీరం రెండూ బంక మట్టిలాంటివి. మనం ఎలా మలిస్తే అలా తయారవుతారు. అందుకే చిన్నప్పుడే మంచి అలవాట్లు, మంచి ఆటలు నేర్పిద్దాం’’ అంటున్నారు శిల్పా శెట్టి. శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవం. ఈ సందర్భంగా విలు విద్య ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు శిల్పా. గతంలో ఓ ట్రిప్‌లో భాగంగా ఈ విద్య నేర్చుకున్నారట. అప్పుడు తీసిన వీడియో ఇది అని, నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని పేర్కొన్నారు.
క్రీడల ప్రాముఖ్యత గురించి శిల్పా శెట్టి మాట్లాడుతూ– ‘‘క్రీడలు పిల్లలకు వ్యాయామంలా ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన పోటీ అలవాటు చేస్తాయి. ఏదో నేర్చుకోవాలనే తపనను రేకెత్తిస్తాయి. ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంచుతాయి. మనం ఆడండి అని పిల్లలకు చెప్పడం కంటే మనం ఆడుతుంటే చూసి ఇంకా చురుకుగా నేర్చుకోవడం కూడా జరుగుతుంది. శుక్రవారంతో ఫిట్ ఇండియా ఉద్యమానికి ఏడాది పూర్తవుతుంది. తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే... మీ పిల్లలకు ఏదో ఒక ఆట నేర్పిస్తూ ఉండండి. మీరు కూడా నేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి.. ఆనందంగా ఉండండి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment