Asia Cup: ఆర్చరీలో భారత్‌ అదుర్స్‌   | India Won 14 Medals Placed In 1st Position Asia Cup Archery 2022 | Sakshi
Sakshi News home page

Asia Cup: ఆర్చరీలో భారత్‌ అదుర్స్‌  

Published Thu, May 12 2022 7:35 AM | Last Updated on Thu, May 12 2022 7:42 AM

India Won 14 Medals Placed In 1st Position Asia Cup Archery 2022 - Sakshi

సులేమానియా (ఇరాక్‌): ఆసియా కప్‌ స్టేజ్‌–2 ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత జూనియర్‌ ఆర్చర్లు అసాధారణ ప్రదర్శనతో ‘టాప్‌’ లేపారు. పురుషుల కాంపౌండ్‌ ఈవెంట్‌లో క్లీన్‌స్వీప్‌ చేశారు. దీంతో భారత్‌ 8 స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో మొత్తం 14 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మహిళల రికర్వ్‌ ఫైనల్లో భజన్‌ కౌర్, అవని, లక్ష్మిలతో కూడిన భారత జట్టు ‘షూటాఫ్‌’లో బంగ్లాదేశ్‌ జట్టుపై నెగ్గింది. పురుషుల రికర్వ్‌ ఫైనల్లో పార్థ్‌ , మృణాల్, జుయెల్‌లతో కూడిన భారత జట్టు 5–1తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. పురుషుల కాంపౌండ్‌ ఫైనల్లో ప్రథమేశ్‌ 146–144తో రిషభ్‌పై గెలిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement