టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో హర్వీందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. కొరియాకు చెందిన పారా అథ్లెట్ కిమ్ మిను సూతో జరిగిన కాంస్య పతక పోరులో 6-5 తేడాతో ఓడించిన హర్వీందర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక పారాలింపిక్స్‌లో ఆర్యరీ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారత పారా అథ్లెట్‌గా హర్వీందర్ చరిత్ర సృష్టించాడు. హర్వీందర్ సింగ్ సాధించిన పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 13కు చేరుకుంది.
ఇప్పటిదాకా 2 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించిన ఇండియా... పతకాల పట్టికలో 37వ స్థానంలో నిలిచింది. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా.. శుక్రవారం 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్‌హెచ్ 1 ఫైనల్‌లో కాంస్యం సాధించింది. ఒకే పారాలింపిక్స్ టోర్నీలో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా అవనీ లేఖరా సరికొత్త చరిత్ర సృష్టించింది.
చదవండి: Tokyo Paralympics: సాహో జెంగ్ టావో.. చేతులు లేకపోయినా 4 బంగారు పతకాలు గెలిచాడు
Avani Lekhara: 'అవని' మరోసారి మెరిసింది.. షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం
Comments
Please login to add a commentAdd a comment