అంటాల్యా (తుర్కియే): అంచనాలకు మించి రాణించిన ఆంధ్రప్రదేశ్ యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర (విజయవాడ) ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో రెండు పతకాలతో మెరిశాడు. తొలిసారి ప్రపంచకప్ టోర్నీలో ఆడుతున్న 21 ఏళ్ల ధీరజ్ పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కలిసి రజత పతకం ... వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
పురుషుల టీమ్ ఫైనల్లో ధీరజ్, అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్ బృందం 4–5తో లీ జాంగ్‌యువాన్, కి జింగ్‌షువో, వె షావోజువాన్‌లతో కూడిన చైనా జట్టు చేతిలో ఓడింది. వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో ధీరజ్ 7–3తో ఇల్ఫాత్ అబ్దులిన్ (కజకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో ధీరజ్ 4–6తో డాన్ ఒలారు (మాల్డోవా) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment