Indian archery teams
-
సంచలనం సృష్టించిన భారత ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్లకు షాక్
భారత ఆర్చరీ జట్టు సంచలనం సృష్టించింది. చైనా వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్ స్టేజ్ 1 పోటీల్లో డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ సౌత్ కొరియాకు ఊహించని షాకిచ్చింది. 🚨 India secured one of its biggest wins in archery as the men's recurve team stunned reigning Olympic champion South Korea to win the gold medal at the ongoing World Cup Stage 1. 🇮🇳🥇👏 pic.twitter.com/hZkHdOicqo— Indian Tech & Infra (@IndianTechGuide) April 28, 2024 ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన భారత పురుషుల రికర్వ్ జట్టు.. దక్షిణ కొరియాపై 5-1 తేడాతో చారిత్రక విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అర్చరీ వరల్డ్‌కప్‌లో 14 ఏళ్ల తర్వాత భారత్‌కు లభించిన తొలి స్వర్ణ పతకం ఇది. ఈ విజయంతో భారత్ పారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి. -
భారత ఆర్చరీ జట్టులో ధీరజ్, జ్యోతి సురేఖ
ఈ ఏడాది జరిగే మూడు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ఆదివారం ఎంపిక చేశారు. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఆధ్వర్యంలో హరియాణాలోని సోనీపట్‌లో సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. పురుషుల రికర్వ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్ ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచి జాతీయ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విజయవాడకు చెందిన ధీరజ్ ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ బెర్త్ కూడా దక్కించుకున్నాడు. ధీరజ్‌తోపాటు తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, మృణాల్ చౌహాన్ భారత రికర్వ్ జట్టులో చోటు సంపాదించారు. భారత మహిళల రికర్వ్ జట్టులో ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి, భజన్ కౌర్, అంకిత, కోమలిక ఎంపికయ్యారు. మరోవైపు ఒలింపిక్ ఈవెంట్కాని కాంపౌండ్ విభాగంలో భారత మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతోపాటు అదితి స్వామి, పర్ణీత్ కౌర్, అవనీత్ కౌర్ చోటు సంపాదించారు. పురుషుల కాంపౌండ్ జట్టులో ప్రథమేశ్, అభిõÙక్ వర్మ, రజత్ చౌహాన్, ప్రియాంశ్ ఎంపికయ్యారు. ప్రపంచకప్ తొలి టోర్నీకి ఏప్రిల్ 23 నుంచి 28 వరకు షాంఘై ఆతిథ్యమిస్తుంది. ప్రపంచకప్ రెండో టోర్నీ మే 21 నుంచి 26 వరకు యోచోన్లో, ప్రపంచకప్ మూడో టోర్నీ జూన్ 18 నుంచి 24 వరకు అంటాల్యాలో జరుగుతాయి. -
ధీరజ్ 'గురి' అదిరె.. ఆర్చరీ వరల్డ్‌కప్‌లో ఇరగదీసిన ఆంధ్ర కుర్రాడు
అంటాల్యా (తుర్కియే): అంచనాలకు మించి రాణించిన ఆంధ్రప్రదేశ్ యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర (విజయవాడ) ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో రెండు పతకాలతో మెరిశాడు. తొలిసారి ప్రపంచకప్ టోర్నీలో ఆడుతున్న 21 ఏళ్ల ధీరజ్ పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కలిసి రజత పతకం ... వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల టీమ్ ఫైనల్లో ధీరజ్, అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్ బృందం 4–5తో లీ జాంగ్యువాన్, కి జింగ్షువో, వె షావోజువాన్లతో కూడిన చైనా జట్టు చేతిలో ఓడింది. వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో ధీరజ్ 7–3తో ఇల్ఫాత్ అబ్దులిన్ (కజకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో ధీరజ్ 4–6తో డాన్ ఒలారు (మాల్డోవా) చేతిలో ఓడిపోయాడు. -
‘పసిడి’ కాంతలు
- ప్రపంచకప్ ఆర్చరీలో దీపిక బృందానికి స్వర్ణ పతకం - పురుషుల జట్టుకు రజతం వ్రోక్లా (పోలండ్): సీజన్లో చివరి ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత ఆర్చరీ జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. దీపిక కుమారి నేతృత్వంలోని మహిళల రికర్వ్ జట్టు స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... జయంత తాలుక్దార్ సారథ్యంలోని పురుషుల రికర్వ్ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల జట్టు 6-0 (52-50; 54-51; 56-54) స్కోరుతో మెక్సికో జట్టును ఓడించింది. టీమిండియా వరుసగా మూడు సెట్లను గెల్చుకొని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు జయంత తాలుక్దార్, తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్లతో కూడిన భారత పురుషుల బృందం 3-5 (54-56; 52-53; 55-53; 52-52) స్కోరుతో మెక్సికో చేతిలో ఓటమి పాలైంది. ఫైనల్లో రెండు జట్లలోని ముగ్గురు సభ్యులకు ఒక్కో రౌండ్లో (గరిష్టంగా నాలుగు రౌండ్లు) రెండేసి బాణాలు సంధించే అవకాశం ఇస్తారు. ఆరు బాణాల తర్వాత ఎక్కువ పాయింట్లు నెగ్గిన వారికి సెట్ వశమవుతుంది. సెట్ నెగ్గితే రెండు పాయింట్లు ఇస్తారు. స్కోరు సమమైతే మాత్రం ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. ఎక్కువ సెట్ పాయింట్లు నెగ్గిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక కుమారి ఈసారి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. భారత్ సంధించిన ఐదు 10 పాయింట్ల స్కోరులో దీపికవే మూడు ఉండటం విశేషం. మరోవైపు మెక్సికో జట్టులో కేవలం రెండు 10 పాయింట్ల స్కోరు ఉండటం గమనార్హం. ‘ఫైనల్ మ్యాచ్ కష్టంగా అనిపించలేదు. ఇదే జోరును ఆసియా క్రీడల్లో కొనసాగిస్తామనే నమ్మకం ఉంది. ఈ స్వర్ణ పతకంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఈ సీజన్ మాకు కలిసిరాలేదు. అయితే ఆసియా క్రీడలకు ముందు మా శ్రమకు ఫలితం లభించింది’ అని దీపిక కుమారి వ్యాఖ్యానించింది. -
‘పసిడి’ రేసులో భారత జట్లు
ప్రపంచకప్ ఆర్చరీ వ్రోక్లా (పోలండ్): వ్యక్తిగత విభాగాలలో అంతగా ఆకట్టుకోలేకపోయినా... టీమ్ ఈవెంట్స్‌లో భారత ఆర్చరీ జట్లు అలరించాయి. ప్రపంచకప్ స్టేజ్-4 టోర్నమెంట్లో పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాయి. శుక్రవారం జరిగిన టీమ్ ఎలిమినేషన్ రౌండ్స్‌లో భారత జట్లు నిలకడగా రాణించాయి. అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, జయంత తాలుక్దార్లతో కూడిన భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో 5-4 (55-57, 57-55, 53-54, 57-52; టైబ్రేక్ 29-27) స్కోరుతో చైనాను ఓడించింది. సెట్ గెలిచిన వారికి రెండు పాయింట్లు లభిస్తాయి. నిర్ణీత నాలుగు రౌండ్ల తర్వాత రెండు జట్లు 4-4 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి టైబ్రేక్‌ను నిర్వహించగా... భారత బృందం పైచేయి సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో మెక్సికోతో టీమిండియా తలపడుతుంది. అంతకుముందు తొలి రౌండ్లో భారత్ 5-1తో స్పెయిన్‌పై; క్వార్టర్ ఫైనల్లో 5-4తో నెదర్లాండ్స్‌పై నెగ్గింది. మరోవైపు మహిళల విభాగంలో దీపిక కుమారి, లక్ష్మీరాణి, బొంబేలా దేవిలతో కూడిన భారత బృందం సెమీఫైనల్లో 6-2 (51-50, 56-48, 52-54, 54-53) స్కోరుతో జార్జియాపై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో మెక్సికోతో భారత్ తలపడుతుంది. అంతకుముందు తొలి రౌండ్లో టీమిండియా 6-0తో పోలండ్పై; క్వార్టర్ ఫైనల్లో 5-4తో ఉక్రెయిన్‌పై గెలిచింది.