ఈ ఏడాది జరిగే మూడు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ఆదివారం ఎంపిక చేశారు. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఆధ్వర్యంలో హరియాణాలోని సోనీపట్‌లో సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. పురుషుల రికర్వ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్ ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచి జాతీయ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విజయవాడకు చెందిన ధీరజ్ ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ బెర్త్ కూడా దక్కించుకున్నాడు.
ధీరజ్‌తోపాటు తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, మృణాల్ చౌహాన్ భారత రికర్వ్ జట్టులో చోటు సంపాదించారు. భారత మహిళల రికర్వ్ జట్టులో ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి, భజన్ కౌర్, అంకిత, కోమలిక ఎంపికయ్యారు. మరోవైపు ఒలింపిక్ ఈవెంట్‌కాని కాంపౌండ్ విభాగంలో భారత మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతోపాటు అదితి స్వామి, పర్ణీత్ కౌర్, అవనీత్ కౌర్ చోటు సంపాదించారు.
పురుషుల కాంపౌండ్ జట్టులో ప్రథమేశ్, అభిõÙక్ వర్మ, రజత్ చౌహాన్, ప్రియాంశ్ ఎంపికయ్యారు. ప్రపంచకప్ తొలి టోర్నీకి ఏప్రిల్ 23 నుంచి 28 వరకు షాంఘై ఆతిథ్యమిస్తుంది. ప్రపంచకప్ రెండో టోర్నీ మే 21 నుంచి 26 వరకు యోచోన్‌లో, ప్రపంచకప్ మూడో టోర్నీ జూన్ 18 నుంచి 24 వరకు అంటాల్యాలో జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment