ఆసియా క్రీడలు ప్రారంభమైన ఇన్నాళ్ల తర్వాత మళ్లీ భారత జట్టుకు మరో స్వర్ణపతకం వచ్చింది. మొట్టమొదటి సారిగా ఆర్చరీ విభాగంలో భారత పురుషుల జట్టు ఈ ఘనతను సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోటీలో దక్షిణ కొరియ జట్టును 227-225 స్కోరు తేడాతో ఓడించింది. ఈ స్వర్ణపతకంతో భారతజట్టు పతకాల పట్టికలో కొం పైకి ఎగబాకే అవకాశం వచ్చింది. దీంతో కలిపి 17వ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ కు రెండే స్వర్ణాలు లభించాయి.
మరోవైపు భారత మహిళల జట్టు కూడా ఈ పోటీలలో పాల్గొన్నా.. కాంస్యపతకంతో సరిపెట్టుకుంది. ఇరాన్ జట్టును 224-217 తేడాతో ఓడించి భారత జట్టు కాంస్యపతకం సాధించింది.
భారత ఆర్చరీ జట్టుకు స్వర్ణపతకం
Published Sat, Sep 27 2014 8:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM
Advertisement
Advertisement