భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది.
బెలెక్ (టర్కీ): భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. మహిళల వ్యక్తిగత రికర్‌వ విభాగం తొలి రౌండ్‌లో దీపిక 6-0తో (29-24, 26-20, 29-28) అనెటా క్రెయిక్‌బెర్గా (లాత్వియా)పై... రెండో రౌండ్‌లో 6-2తో (24-22, 25-28, 29-24, 27-24) వియోలెటా (పోలాండ్)పై గెలిచింది. గురువారం జరిగే మూడో రౌండ్‌లో లండన్ ఒలింపిక్‌స కాంస్య పతక విజేత మరియానా అవితా (మెక్సికో)తో దీపిక ఆడుతుంది. భారత్‌కే చెందిన డోలా బెనర్జీ కూడా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. డోలా తొలి రౌండ్‌లో 6-2తో (27-28, 27-22, 29-24, 28-26) ఎలీనా మౌసికో (సైప్రస్)పై.. రెండో రౌండ్‌లో 6-0తో (27-25, 28-24, 26-25) మరియా రెన్‌డోన్ (కొలంబియా)పై నెగ్గింది. భారత మరో ఆర్చర్ చక్రవోలు స్వురో మాత్రం తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది.పురుషుల వ్యక్తిగత రికర్‌వ విభాగంలో భారత్‌కు చెందిన ముగ్గురు ఆర్చర్లు జయంత తాలుక్‌దార్, తరుణ్‌దీప్, కపిల్ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. కాంపౌండ్ మిక్‌సడ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ తన భాగస్వామి అభిషేక్ వర్మతో కలిపి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో జ్యోతి-అభిషేక్ జంట 147-150తో అలెగ్జాండర్ దమ్‌బయేవ్-అల్బీనా లోగినోవా (రష్యా) జోడి చేతిలో ఓడిపోయింది.